రేగొండ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ రూపకల్పన పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని ఆర్టీఓ హరికృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలంలోని బీఎల్‌ఓలు, బీఎల్‌ఓల సూపర్‌వైజర్లకు ఓటరు జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితాను ఇంటింటి సర్వే చేసి పకడ్బందీగా రూపొందించాలని తెలిపారు. జాబితా సవరణలో నిర్లక్ష్యం చేసిన బీఎల్‌ఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల తహసీల్దార్లు శ్వేత, హేమ, డిప్యూటీ తహసీల్దార్లు అబ్దుల్ రజాక్, శ్రీలత, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
ఆర్డీఓ హరికృష్ణ


