● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి: జిల్లాలో పల్స్ పోలియో, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలను అన్ని శాఖల అధి కారుల సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. సోమవా రం సోమవారం పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నిర్మూలన, డయేరియా నివారణ, పొగాకు వినియోగం మానేయడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించడం తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టబోయే ప్రతిష్టాత్మక ఆరోగ్య కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 28న పల్స్‌పోలియో నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 34,728 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. అలాగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం జూలై 13 సందర్భంగా 1–19 సంవత్సరాలు వయస్సు ఉన్న 70,773 మందిని గుర్తించి నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంత కుమారి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్డీఓ హరికృష్ణ, డీపీఓ శ్రీలత, ఇంటర్ మీడియట్ అధికారి వెంకన్న, మున్సిపల్, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 66 దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించడానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజలు అందించిన దరఖాస్తులు జాప్యం చేయకుండా స త్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిన ప్రతీ దరఖాస్తును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పరిష్కారంలో ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.


