బడికి రెడీ | - | Sakshi
Sakshi News home page

బడికి రెడీ

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

నేటినుంచి పాఠశాలలు

పునఃప్రారంభం

ఇంకా సిద్ధం కాని వెల్‌కమ్‌ కిట్లు

పూర్తికాని పాఠశాలల అభివృద్ధి పనులు

జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు

281

43

70

భూపాలపల్లి అర్బన్‌: వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాల్సిన సమయంలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన పాఠశాల వెల్‌కమ్‌ కిట్లు ఇంకా జిల్లాకు చేరకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల కొరత వెంటాడుతోంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రీపైమరీ విద్య జిల్లాలో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ టీచర్లు, ఆయాల నియామకం చేపట్టలేదు. నూతనంగా మరో 41 పాఠశాల్లో ప్రీప్రైమరీ ప్రారంభించేందుకు టీచర్ల, ఆయాలను నియమించాల్సి ఉండగా నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదు. దీంతో చిన్నారుల బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూత పడుతున్న ప్రాథమిక పాఠశాలలు

జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం వరకు జిల్లా వ్యాప్తంగా 317 ప్రాథమిక, 44 ప్రాథమికోన్నత, 69 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గడిచిన 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కొన్ని, విద్యార్థులు లేరని మరికొన్ని మొత్తంగా 36 ప్రాథమిక పాఠశాలను అధికారులు మూసి ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపించారు. ఈ విద్యా సంవత్సరం మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారో లేదో అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యి నుంచి రెండు వేల వరకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని అభివృద్ధి పనులు

జిల్లాలోని 265 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదు. 947 రకాల పనులకు రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ముందే రూ.12.41 కోట్ల నిధులు కేటాయించింది. 683 పనులు పూర్తి చేశారు. 72 రకాల పనులు నేటి వరకు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇంకా 192 పనులు కొనసాగుతున్నాయి. తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాల, విద్యుత్‌ కల్పన వంటి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలల్లో నిర్మాణ సామగ్రి ఇంకా ప్రాంగణంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 32కోట్లతో చేపట్టిన మన ఊరు–మన బడి కార్యక్రమం కింద 149 పాఠశాలల్లో ప్రారంభించిన పనులు కూడా అనేక చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి. తరగతి గదుల అభివృద్ధి, ప్రహరీ, విద్యుత్‌ సదుపాయాల పనులకు నిధుల కొరతతో పూర్తి కాకపోవడంతో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో వసతులు అందడం లేదు.

ప్రణాళిక లేకపోవడంతో..

పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలంటే పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేసి, వెల్‌కమ్‌ కిట్లను పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త విద్యా సంవత్సరంలోనూ సమస్యలు విద్యార్థులకు తోడుగా బడికి వస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

ప్రాథమికోన్నత పాఠశాలలు

అభివృద్ధి పనులు

మంజూరైన పాఠశాలలు 265

ఎంపిక చేసిన పనులు 947

మంజూరైన నిధులు రూ.12.41కోట్లు

పూర్తి చేసిన పనులు 683

పనులు కొనసాగుతున్నవి 192

ఇంకా ప్రారంభంకాని పనులు 72

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

మా తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. నేను మెదక్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌కు వెళ్లి యూనివర్సిటీలో చదువుకున్నాను. మేం చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం ప్రోత్సహించే వాళ్లు. అప్పట్లో పాఠశాలల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్య ప్రాధాన్యతను వివరించేవాళ్లు. ఇబ్బందులు ఎదురైతే ఉపాధ్యాయులు ప్రోత్సహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. – అశోక్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement