ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి? | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ఏపీఓగా దామోదరస్వామి?

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

ఏటూరునాగారం: ఐటీడీఏ అసిస్టెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా టీవీఆర్‌ దామోదరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉట్నూరు ఐటీడీఏలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న దామోదరస్వామికి పదోన్నతి కల్పిస్తూ ఏటూరునాగారానికి బదిలీ చేసినట్లు సమాచారం. ఈయన గతంలో స్థానిక ఐటీడీఏలో పనిచేస్తూ ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న దామోదరస్వామికి ఉద్యోగోన్నతి రావడంతో ఏటూరునాగారంలో ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో మరో రెండు రోజుల్లో ఏటూరునాగారం ఏపీఓగా ఆయన బదిలీపై వచ్చి బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిసింది.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రవి

ములుగు రూరల్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన తోకల రవిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. 2004 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంఘం అభివృద్ధికి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం రవి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్‌, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement