వెదజల్లుతున్న దుర్వాసన | - | Sakshi
Sakshi News home page

వెదజల్లుతున్న దుర్వాసన

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం ప్రసాదశాల నుంచి వచ్చే డ్రెయినేజీ పైప్‌లైన్‌ జామ్‌ కావడంతో మురుగు నీరు బయటకు పొంగిపొర్లి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మే 21 నుంచి జూన్‌ 1 వరకు జరిగిన సరస్వతినది అంత్య పుష్కరాల అనంతరం ఈ సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. పుష్కరాలు ముగిసి 14 రోజులుగా మురుగు నీరు బయటకు రోడ్డుమీద పారుతూ దుర్గంధం వెదజల్లుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్థానికులకు, సమీపంలోని ఇళ్లకు తీవ్ర దుర్వాసనతో ముక్కుపుటాలు అదిలిపోతున్నట్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు స్థానికులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement