పోడు భూములకు పట్టాలివ్వాలి | - | Sakshi
Sakshi News home page

పోడు భూములకు పట్టాలివ్వాలి

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

ఏఐకేఎంఎస్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన

కార్యదర్శి బాలరాజు

వెంకటాపురం(ఎం): పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏఐకేఎంఎస్‌ డివిజన్‌ ప్రథమ మహాసభకు బొమ్మెడ సాంబయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో 40 సంవత్సరాలకు పైగా పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకోకుండా ఆపేసి సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని పెట్టిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి పోడుభూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్‌ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి, ములుగు డివిజన్‌ కమిటీని ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement