ఈదురుగాలులతో వర్షం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలులతో వర్షం

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

మొగుళ్లపల్లి: మండలంలోని రంగాపురం గ్రామంతో పాటు శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రంగాపురం గ్రామంలోని పలువురి ఇంటి పై కప్పులు లేచిపోయాయి. రంగాపురం–మొగుళ్లపల్లి ప్రధాన రోడ్డులో చెట్లు నేలకొరిగాయి. దాంతో సుమారు గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు మినహా అన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్లను రోడ్డుపై నుంచి తొలగించడంతో వాహనాలు వెళ్లిపోయాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement