జిల్లాలో ఇలా..
విద్యారణ్యపురి: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అర్దాకలితో ఉండాల్సిన అవసరం లేదిక. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో హనుమకొండలోని ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాల, హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలను తొలుత ఎంపిక చేశారు. వీరికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
ఫీడ్‌బ్యాక్..
హనుమకొండలోని ఆ మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం అప్పగించిన ఓసొసైటీ బుధవారం తమ సిబ్బందితో బుధవారం బ్రేక్ ఫాస్ట్ తీసుకొచ్చి అందించింది. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు పూరీ కుర్మా, రాగి ఇడ్లీ, చట్నీ వడ్డించారు. ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఆకళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, ప్రభుత్వ పింగిళి కళాశాలలో ఆకళాశాల ప్రిన్సిపాల్ కవిత పర్యవేక్షణలో ఆసొసైటీకి సంబంధించిన సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్ అందించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం
హనుమకొండ జిల్లాలోని మూడు కాలేజీల్లో అమలుకు నిర్ణయం
బ్రేక్‌ఫాస్ట్ అందించి ఫీడ్ బ్యాక్ తీసుకున్న సిబ్బంది
ఈనెల 15 నుంచి అమలు!
హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులు 706 మంది ఉండగా.. మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు 422 మంది అడ్మిషన్లు పొందారు. ఈప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం సెకండియర్‌లో 326 మంది ఉండగా మొదటి సంవత్సరంలో 150 మంది అడ్మిషన్లు తీసుకున్నారు.
హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలలో సెకండియర్‌లో 588 మంది విద్యార్థులు ఉండగా.. ఫస్ట్ ఇయర్‌లో 400 మంది ప్రవేశాలు పొందారు. ఈసంఖ్య మరింత పెరగనుంది.


