కాళేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.48.25 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.48.25 లక్షలు

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలను విప్పి నగదు లెక్కించగా రూ.48,25,170 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌.మహేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారిగా ఇన్‌స్పెక్టర్‌ ఎం.అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గ్రంధసిరి సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, పద్మ, శ్యామసుందర్‌, కాటం సత్తయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.

హత్యాయత్నం కేసులో

నిందితుల అరెస్ట్‌

టేకుమట్ల: మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామానికి చెందిన ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్త రవిని విద్యుత్‌షాక్‌తో హత్య చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు.

గ్రామస్తులు కలిసిరావాలి

చిట్యాల: డ్రగ్స్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులంతా కలిసి రావాలని చల్లగరిగ సర్పంచ్‌ సిరిపిల్లి జంపయ్య అన్నారు. శుక్రవారం సర్పంచ్‌ జంపయ్య అధ్యక్షతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం జరిగింది. గ్రామంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వాడరాదని తీర్మానం చేసినట్లు తెలిపారు. డ్రగ్స్‌ వాడినా, వికయ్రించానా గ్రామ పంచాయతీకి సమాచారం అందిస్తే రూ.5వేల16 నగదు, బహుమతి అందజేస్తామన్నారు. సమాచారం అందించిన వారిపేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డ్రగ్స్‌ నిర్మూలనకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గుండెకారి స్వప్న, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు

మహాముత్తారం: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామంలోని ముక్కెర వెంకటస్వామి ఇంటిపై విద్యుత్‌ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. ఈదురుగాలులు వచ్చినప్పుడు ఒక దానికి ఒకటి తగిలి మిరుగులు రావడంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్‌శాఖ అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇప్పటికై నా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి తీగలను సరిచేయాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement