కేసుల పురోగతిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

కేసుల పురోగతిపై సమీక్ష

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

చిట్యాల: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లో అమలవుతున్న క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరుపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా చిట్యాల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.మల్లేష్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోచంపల్లి సతీష్‌ స్టేషన్‌ పరిధిలో సీసీటీఎన్‌ఎస్‌ ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్‌ సేవల పురోగతిని, కేసుల నమోదు విధానాన్ని అడిషనల్‌ ఎస్పీ కంప్యూటర్‌ స్క్రీన్‌ ద్వారా ప్రత్యక్షంగా వివరించారు. స్టేషన్‌లో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను అడిషనల్‌ ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన టెక్‌ టీం రైటర్లకు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల ఫైళ్లను, నిర్దేశించిన లక్ష్య సమయం లోపు పూర్తిచేసి ఆలస్యం లేకుండా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రికార్డులను ఎల్లప్పుడూ పారదర్శకంగా, అప్‌డేట్‌గా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో చిట్యాల పోలీస్‌ స్టేషన్‌ టెక్‌ టీం రైటర్స్‌ ఎ.మమత, జి.నాగమణి, లాల్‌సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement