ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.. | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారయాణరావు అన్నా రు. బుధవారం జంగేడుహనుమాన్‌ టెంపుల్‌ ప్రాంగణంలో 2, 15వ వార్డుల సంయుక్త వార్డు నిర్శహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం వార్డు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గణపురం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం గణపురం, చెల్పూరు, బస్వరాజుపల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు బస్వరాజుపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement