
షాపుల నిర్వహణకు వేలం
● కాళేశ్వరాలయానికి
రూ.61.31లక్షల ఆదాయం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థాన ఆవరణంలో వివిధ షాపులు నిర్వహణకు లైసెన్స్ హక్కుల కోసం ఈ–టెండర్, సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం రెండు సంవత్సరాలకు ఈఓ మహేష్ ఆధ్వర్యంలో కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించారు. గురువారం నిర్వహించి ఈప్రక్రియలో టెండర్ల ద్వారా ఆలయానికి సంవత్సరానికి గాను రూ. 61.31 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. ఎండోమెంట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత పర్యవేక్షించారు. మరో 6 టెండర్లు సరైన పాట దారులు రానందున వాయిదా వేసినట్లు ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. రెండో సంవత్సరం కూడా ప్రస్తుతం టెండరు దక్కించుకున్న నిర్వహకులు ఇదే ధర ప్రకారం టెండరు డబ్బులు చెల్లించాలని ఈఓ పేర్కొన్నారు.