
ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి
భూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే ఆకాంక్షించారు. పోలీసు శాఖలో 35 ఏళ్లపాటు సమర్థవంతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన రేగొండ ఏఎస్సై మల్యాల ప్రభాకర్, గణపురం ఏఎస్సై బైరి అబ్బయ్యను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రత్నం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే