
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మల్హర్ మండలంలో మొక్కదశలో ఉన్న పత్తిచేను
పలిమెల 375.1
భూపాలపల్లి 348.5
మొగుళ్లపల్లి 318.4
రేగొండ 311
టేకుమట్ల 304.5
చిట్యాల 303.4
మహాముత్తారం 293.9
గణపురం 283.5
మహదేవపూర్ 278.3
మల్హర్ 257.7
కాటారం 247.2
కొత్తపల్లిగోరి 214.2
కల్యాణం.. కమనీయం
రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణం నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవరకు పూజలు
మల్హర్: శ్రావణ శుక్రవారం సందర్భంగా మండలంలోని కొయ్యూరు పీవీనగర్ గ్రామంలో ఆదివాసీలు శ్రీ లక్ష్మీదేవర ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రా మంలోని లక్ష్మీదేవర తల్లికి మహిళలు గాజులు సమర్పించి, పసుపు, కుంకమలతో అభిషేకం చేశారు. అనంతరం మహిళలు ఒకరికొకరు గా జులు వేసుకొని సంబరాలు జరుపుకున్నారు.
ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు
గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఓపెన్ ఇంటర్, టెన్త్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడుపును పొడిగించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాద రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ వరకు, అపరాద రుసుముతో 28వ తేదీ వరకు ప్రవేశాల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం ప్రతీ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్టడీ సెంటర్లను సంప్రదించాలని కోరారు.
75శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కాకతీయ గనుల్లో గడిచిన జూలై మాసంలో 75శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై మాసంలో 2.91 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 2.18లక్షల బొగ్గు ఉత్పత్తిని వెలికితీసినట్లు చెప్పారు. వెలికితీసిన బొగ్గును రవాణా చేసినట్లు తెలిపారు. జూలై మాసంలో అత్యధికంగా 265 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఉత్పత్తి శాతం తగ్గిందన్నారు. రక్షణతో కూ డిన ఉత్పత్తిని సాధించాలని, గైర్హాజరు కాకుండా ప్రతీ రోజు విధులకు హాజరుకావాలని సూచించారు. సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు.
మిర్చి, వరి సాగుపై
తీవ్ర ప్రభావం..
ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురవకపోవడంతో వరి, మిర్చి పంటల సాగు ఆలస్యం అవుతోంది. జూన్, జూలై నెలల్లో కురిసిన వానలు పత్తి పంటలకు అనుకూలంగా మారాయి. ఆ వర్షాలకు వడ్లు అలికి వరిసాగుకు సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం నిరాశ చెందుతున్నారు. సరిపడా వర్షాలు పడకపోవడంతో ఇప్పటికీ వరినాట్లు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. బోర్లు, బావులు, చెరువులు, కాల్వల కింద ఉన్న రైతులు ధైర్యంచేసి వరి నాట్లు వేస్తుండగా వానల మీద ఆధారపడే రైతులు ఇంకా నాట్లు వేయడం లేదు. దీంతో నారు ముదిరి రంగు మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మిర్చి సాగుచేసే రైతులు గింజలు అలుకగా అవి మొక్క దశలో ఉన్నాయి. మరిన్ని వర్షాలు కురిస్తే మిర్చి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
భూపాలపల్లి: ఈ ఏడాది వర్షాలు అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడ క, లోటు వర్షపాతం నమోదు కావడం, చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరకపోవడంతో పంటల సా గుకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నా యి. పత్తికి వర్షాలు అనుకూలంగా కురుస్తున్నప్పటికీ వరి, మిర్చి పంటల సాగు ఆలస్యమవుతోంది.
లోటు వర్షపాతమే..
జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో ప్రధానంగా వరి 1,12,218, పత్తి 93,823, మిర్చి 28వేల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. జూన్ నెలలో మోస్తారు వర్షాలు కురవగా, జూలైలో మూడు, నాలుగవ వారాల్లో సాధారణ, లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో జిల్లావ్యాప్తంగా సగటున 16 రోజుల పాటు వర్షం కురిసినట్లుగా నమోదైనప్పటికీ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. మహదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్, కొత్తపల్లిగోరి మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం వేడెక్కి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వర్షాలు కురుస్తాయా లేదా పంటల సాగు ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
చెరువుల్లో కనిపించని నీరు..
వర్షాకాలం ప్రారంభం నుంచి కురిసిన వర్షాలకు జిల్లాలోని ఏ ఒక్క రిజర్వాయర్, చెరువు కూడా నిండలేదు. చిన్న, చిన్న కుంటలు నిండినప్పటికీ ఆయకట్టులో పెద్దగా సాగు జరిగే అవకాశం లేదు. దీంతో జలాశయాల మీద ఆధారపడి సాగుచేసే రైతులు వరణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)లో 1వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఆదాయం సర్టిఫికెట్‌లు జతచేసి ఈనెల 8వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లేదా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో దరఖాస్తు అందించాలని కోరారు. వివరాలకు జిల్లాషెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
నేడు మంత్రి పర్యటన
మల్హర్: మండలంలోని తాడిచర్ల గ్రామంలో నేడు (శనివారం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పర్యటించనున్నారు. తాడిచర్లలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పీఏసీఎస్ భవనం, రూ.20 లక్షల నిధులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. రూ.15 లక్షలతో తహసీల్దార్ కార్యాలయం ప్రహరీ, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
న్యూస్‌రీల్
స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) విడుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్‌లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్‌లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొటో అప్‌లోడ్ అయ్యేందుకు అరగంట సమయం పట్టిందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. సాంకేతిక సమస్య ఇలాగే కొనసాగితే అటెండెన్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు వివరాలు..
జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు శాతం ర్యాంకు
రిజిస్ట్ట్రేషన్
వరంగల్ 534 3,211 2,085 64.93 08
హనుమకొండ 472 2,987 1,883 63.04 16
మహబూబాబాద్ 768 3,859 2,231 57.81 26
జనగామ 459 2,773 1,572 56.69 27
ములుగు 337 1,557 832 53.44 29
భూపాలపల్లి 414 1,927 901 46.76 33
మళ్లీ మొఖం చాటేసిన వానలు
మూడు రోజులుగా
వేసవిని తలపిస్తున్న ఎండ
గత నెలలోనూ
జిల్లాలో లోటు వర్షపాతం
ఆలస్యం అవుతున్న
వరి, మిర్చి పంటల సాగు
ఆందోళనలో రైతులు
ఇప్పుడిప్పుడే వరినాట్లు ..
గత నెలలో కురిసిన వర్షాలకు చిన్నచిన్న చెరువులు నిండాయి. వర్షాలతో పత్తి పంటలకు ఇబ్బంది లేదు. రైతులు గడిచిన పది రోజులుగా వరినాట్లు ప్రారంభించారు. మరిన్ని వర్షాలు పడితే వరి సాగుచేసే రైతులంతా నాట్లు వేసే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– వీరునాయక్, డీఏఓ

శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025