
బైపాస్ రోడ్డు మంజూరు చేయాలి
భూపాలపల్లి: వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా మారిన భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కోరగా సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కావ్య... భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా సింగరేణి, కేటీపీపీ పరిశ్రమల మూలంగా ఎన్‌హెచ్ 353సీ మీద వాహనాల రద్దీ పెరిగి పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో 576 ప్రమాదాలు జరిగి 233 మంది చనిపోయారని తెలిపారు. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భూపాలపల్లి బైపాస్ రోడ్డులో రూ.175 కోట్లు నిర్మాణ పనులకు, రూ.75కోట్లు భూసేకరణకు వినియోగించాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి.. వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య వెల్లడించారు.
కేంద్ర మంత్రిని కోరిన వరంగల్ ఎంపీ కావ్య