
24గంటల్లో కోర్టులో హాజరుపర్చాలి
వెంకటాపురం(కె): తడపల అటవీ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీన గ్రేహౌండ్స్ పోలీసులు పట్టుకున్న ముగ్గురు మావోయిస్టు సభ్యులు రీతా, మోతీ, ఇడ్మాలతో పాటు పనుల రీత్యా అటవికి వెళ్లిన మరో ముగ్గురిని 24గంటల్లో కోర్టులో హాజరుపర్చాలని వెంకటాపురం, వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరున సోషల్ మీడియాలో గురువారం నుంచి లేఖ వైరల్ అవుతోంది. పట్టుకున్న వారిని ఎన్‌కౌంటర్ పేరుతో చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎలాంటి సంబంధం లేని మరో ముగ్గురు అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేయడం సరికాదన్నారు. దీన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని లేఖలో పేర్కొన్నారు.