రేపు పట్టణంలో నీటి సరఫరా బంద్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు పట్టణంలో నీటి సరఫరా బంద్‌

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

– 8లోu కాళేశ్వరం.. సుందరం

న్యూస్‌రీల్‌

భూపాలపల్లి జిల్లా వేదికగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రేవంత్‌ శ్రీకారం

మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌, సభకు హాజరైన జనం

ధాన్యం కొనుగోళ్లలో

వేగవంతం

స్టేషన్‌ఘన్‌పూర్‌/ దేవరుప్పు ల: జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, సెంటర్లు ఏర్పాటు చేసిన చోట కాంటాలు వేయడంలో ఆలస్యం, అకాల వర్షాల భయంతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై ‘కల్లాల్లో కుప్పలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ఈనెల 18న ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పావని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొందరు రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో ధాన్యం కేంద్రాలకు తీసుకురావడంతో తాత్కాలిక నిల్వ సమస్యలు ఎదురవుతున్నాయని, అయితే వాటి పరిష్కారా నికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కొనుగోళ్లలో ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, రైతులు ఏమైనా సమస్యలుంటే స్థానిక అధికారులను సంప్రదించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు.

రోడ్డు ప్రమాదాల

నివారణపై కళాజాతా

జనగామ: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను పురస్కరించుకుని జనగామ పోలీసు ఆధ్వర్యంలో ఆరైవ్‌, అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యవేక్షణలో సోమవారం ఆర్టీసీ బస్టాండ్‌లో వరంగల్‌ కళాబృందం సభ్యులు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ నియమాలు, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలపై పాటల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్‌ ధరించడం, కారులో సీట్‌ బెల్ట్‌ ధరించడం, వేగ పరిమితులను పాటించడం వంటి భద్రతా నియమాలను పాటించాలనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా రవి

జనగామ: జనగామ మున్సిపల్‌ డ్రైవర్స్‌ యూని యన్‌ అధ్యక్షుడిగా మునిగె రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం పట్టణ ంలోని ఓ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మసి రాజు, కోశాధికారిగా భూషపాక ప్రేమ్‌, గౌరవ అధ్యక్షుడిగా మల్లిగారి రాజుతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

మక్కల కొనుగోళ్లు

వెంటనే చేపట్టాలి

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌కు 15 రోజులుగా రైతులు తీసుకొచ్చిన మక్కలు కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం మండలకేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా రైతులు, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు పాలకుర్తి, సేష్టన్‌ఘన్‌పూర్‌, జనగామ, తొర్రూరు రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు లేగ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. తక్షణమే మక్కలు, ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని, లేదంటే జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు దుంపల సంపత్‌, నిరంజన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, పులిగిల్ల ఉపేందర్‌, గడ్డం నరేందర్‌, రాజేష్‌, నవీన్‌, గణేష్‌, నూకల నవీన్‌, చిక్కుడు అశోక్‌, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌కి వెళ్లారు. పియర్స్‌ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్‌ వద్ద డ్రిల్లింగ్‌ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌జైన్‌ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్‌, జియో ఫిజికల్‌, జీపీఆర్‌ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్‌ వాటర్‌, పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూఆర్పీఎస్‌)కు పంపనుంది. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్‌ బేస్డ్‌ జీపీఆర్‌ టెస్ట్‌కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్‌ క్రాస్‌ హోల్‌ సెస్మిక్‌ టెస్ట్‌ వివరాలను వివరించారు.

సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష..

మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్‌ అండ్‌ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ కల్నల్‌ పరిచిత్‌ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు.

ప్రతిపక్షాలపై నిప్పులు..

అభివృద్ధి, సంక్షేమానికి హామీ..

కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌, బీజేపీలపై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్‌ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్‌ నరసింహన్‌ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగా

కుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్‌, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, ప్రేమ్‌సాగర్‌, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

నస్తూర్‌పల్లి

బహిరంగ సభలో

అభివాదం

చేస్తున్న

సీఎం

రేవంత్‌

‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు

ఎన్‌డీఎస్‌ఏ, స్టీరింగ్‌ కమిటీ, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం

బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన

జనగామ: జనగామ పట్టణానికి తాగునీరు అందించే చీటకొడూరు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వద్ద మరమ్మతు కారణంగా రేపు (బుధవారం) నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మతు నేపథ్యంలో రోజువారీగా సరఫరా అయ్యే నీటిని కేవలం నిత్యావసరాలకు మా త్రమే ఉపయోగించుకోవాలని, 20 రోజుల పాటు ఎవరూ కూడా తాగొద్దన్నారు. పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement