● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
● ప్రజావాణిలో 224 దరఖాస్తులు
జనగామ రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులతో పాటు పెండింగ్ వినతులను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలన్నారు. మొత్తం 224 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్టీఓ శ్రీనివాస్‌గౌడ్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, ఎకై ్సజ్ ఎస్పీ అనిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు కొన్ని ఇలా..
● స్టేషన్‌ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన వసంత, కోమళ్లకు చెందిన జయలక్ష్మి, జిల్లా కేంద్రానికి చెందిన కల్యాణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు.
● దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జీడ్డి నాగమ్మ 2010లో 346 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయగా ఆ భూమిని నాలాగా మార్చుకోవాలని విక్రయదారుడు ప్రయత్నిస్తుండని నాలాను రద్దు చేసి, ఆ వ్యక్తులపై చర్య తీసుకోవాలని దరఖాస్తు చేసింది.
● స్టేషన్‌ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన గుంటి గట్టయ్య, తనకు 21 గుంటల వారసత్వ భూమి ఉందని తన పేరు మీదకు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని విన్నవించింది.
● వెంకిర్యాల గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన డబ్బులు బ్యాంక్‌లో చెల్లించకుండా అక్రమాలకు పాల్పడారని, బ్యాక్ మిత్ర, సీఏలపై విచారణ చేపట్టాలని రికవరీ చేయాలని వెంకిర్యాల మహిళా సంఘం సభ్యులు కోరారు.
● ఇప్పగూడెం గ్రామ పరిధిలోని సింగారపు ఏనె గుట్టలో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పగూడెం గ్రామస్తులు కోరారు.
పట్టా భూమిని బ్లాక్ లిస్టులో పెట్టారు
ఏడునూతల గ్రామంలో సర్వే నంబర్ 112ఏ2లో ఆరు ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాం. పట్టా పాస్ బుక్ కూడా ఉంది. కొడకండ్ల బ్యాంక్‌లో రూ.2లక్షల రుణం తీసుకుని చెల్లించా. తహసీల్దార్ పీఓబీ బ్లాక్ లిస్టులో పెట్టారు. విచారణ చేపట్టి పట్టా భూమిని బ్లాక్ లిస్టు నుంచి తొలగించాలి.
– ముత్తినేని వెంకటయ్య, ఏడునూతల, కొడకండ్ల


