విద్యాభివృద్ధికి సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి సమష్టి కృషి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

సమీక్షలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ: జిల్లాలో విద్యాభివృద్ధికి సమష్టి కృషి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపు, కొత్త విద్యార్థుల నమోదుకు సంబంధించి ఎంఈఓలు, సీహెచ్‌ఎంలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలబాలికలు పాఠశాలకు వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో చేపట్టే ‘బడిబాట‘ ప్రత్యేక నమోదు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో గరిష్ట నమోదు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎం) నిర్వహించాలని, ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తన, ఆరోగ్యం, నియమశీలత వంటి అంశాలపై చర్చించాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంఓ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియాబేగం, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలని కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝా స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సోమవారం ఐకేపీ, మెప్మా, సిబ్బందితో వీ డియో కాన్ఫెరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్షించారు. కొ నుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద టోకెన్‌ పద్ధతి ఉంటుందని, దానికి అమలు చేయాలన్నారు.

మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు

జనగామ రూరల్‌/పాలకుర్తి టౌన్‌: అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్‌. ఎల్‌. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్‌, నాయకులు బి. సిద్దయ్య, జిలకర కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు. అలాగే పాలకుర్తిలో శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో మహాకవి సోమనాథ స్మృతి వనంలో బసవేశ్వరుడి జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ ఎఎంఎల్‌ లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా, ఓబీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ పులి గణేష్‌గౌడ్‌, సాంబయ్య, భుజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement