ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

భూపాలపల్లి అర్బన్‌: ముఖ్యమంత్రి నేడు (సోమవారం) కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి రానున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్‌ వరకు ఉన్న ఎన్‌హెచ్‌ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్‌శ్‌మార్‌ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్‌నగర్‌ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించి, పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement