టోకెన్‌ విధానం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

టోకెన్‌ విధానం తప్పనిసరి

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

నర్మెట: ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని, టోకెన్‌ విధానంలోనే ధాన్యం సేకరించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మండలంలోని హ న్మంతాపురం, తరిగొప్పుల మండలకేంద్రంలో ఆది వారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తేమ శాతా న్ని, రికార్డులను పరిశీలించిన ఆయన రైతులకు క ల్పించిన మౌలిక వసతులపై, గన్నీబ్యాగులు, టా ర్ఫాలిన్‌ నిల్వలపై ఆరా తీశారు. రైతలకు వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని, ఎప్పటికప్పుడు ధా న్యాన్ని మిల్లులకు తరలించాని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏఈఓ సుంకరి జగదీష్‌, వీఓఏ రేణుక, ఓం సాయిబాబా గ్రామైఖ్య సంఘం మమత, ఉపేంద్ర, సుధ, లచ్చమ్మ, శ్రీలత, రైతులు ఉన్నారు.

కేజీబీవీ సందర్శన

చిల్పూరు: మండలంలోని రాజవరం గ్రామ సమీ పంలోని కేజీబీవీని ఆదివారం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సందర్శించారు. మొదట భవనంలోని అన్ని గదులను పరిశీలించారు. వంట గదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ రఘురామకృష్ణ తదితరులు ఉన్నారు.

నేటి నుంచి ‘సంక్షేమ వారోత్సవాలు’

జనగామ రూరల్‌: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ‘సంక్షేమ వా రోత్సవాల’ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు జిల్లావ్యాప్తంగా 81 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. విద్యాసంస్థల అభివృద్ధి, వి ద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతమే ప్రధాన ధ్యేయమన్నారు. 20వ తేదీన వంట గదులు, వసతి గృహాలు, పాఠశాలల తనికీ నిర్వహించి పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. 21న క్విజ్‌, చిత్రలేఖనం, నుక్కడ్‌నాటకాలు నిర్వహించాలి. 22న పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను గుర్తించి అంచనాలు సిద్ధం చేయాలి. 23న తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించడం. 24న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం. 25న క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్‌ అక్షరాస్యతపై వేసవి శిబిరాలు నిర్వహించడ. 26న బడిబాట ద్వారా ప్రవేశాల డ్రైవ్‌ నిర్వహించి నమోదు శాతం పెంచడం.

ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement