నేటినుంచి ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

జనగామ: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నేటి నుంచి (ఆదివారం) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ ఇంటర్‌, పదవ తరగతి (ఎస్సెస్సీ) పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్‌, పది తరగతులు కలుపుకుని 2,874 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్‌లో 2,041, పదవ తరగతి కోసం 833 మంది ఉన్నారు.

పరీక్ష సెంటర్లు ఇవే..

ఇంటర్‌, పది ఓపెన్‌ పరీక్షల కోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షల కోసం స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల (ఏ/సెంటర్‌), స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఏ/సెంటర్‌), జనగామ ధర్మకంచ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ధర్మకంచ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో (ఏ/బీ రెండు సెంటర్లు), జనగామ హన్మకొండ రోడ్డులోని సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులం(ఏ/బీ రెండు సెంటర్లు), స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (బీ సెంటర్‌), స్టేషన్‌ఘన్‌పూర్‌ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బీ సెంటర్‌), పదవ తరగతి పరీక్షల కోసం జనగామ ప్రభుత్వ హైస్కూల్‌, వడ్లకొండ, శివునిపల్లి, చాగల్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు (తెలంగాణఓపెన్‌స్కూల్‌.ఓఆర్‌జీ)వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని సూచించిన పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

హాజరుకానున్న

2,874 మంది విద్యార్థులు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement