దాహం తీర్చాలని తల్లికోతి తపన | - | Sakshi
Sakshi News home page

దాహం తీర్చాలని తల్లికోతి తపన

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

ఎండలు మండుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలు కూడా అల్లాడుతున్నాయి. దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో జనగామ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంపై ఆదివారం కనిపించిన ఒక చిన్న దృశ్యం పెద్ద సందేశాన్ని అందిస్తోంది. నల్లా వద్దకు వచ్చి నీళ్ల కోసం అల్లాడుతున్న ఒక తల్లికోతి.. ఒడిలో తన చంటిపాపను గట్టిగా హత్తుకుని మనుషుల్లాగే జాగ్రత్తగా నల్లా తిప్పి నీళ్లు తాగించింది. దీనిని చూసిన ప్రయాణికులు ఒక్క క్షణం అలాగే ఆగిపోయారు. బిడ్డకు నీరు అందించాలని తల్లికోతి పడిన తపన, ప్రేమ, పట్టుదల అక్కడున్న అందరిని కదిలించింది. మనుషులకే కాదు.. ప్రకృతిలోని ప్రతి జీవికి నీరు ఎంత విలువైందో ఈ దృశ్యం మరోసారి గుర్తు చేసింది. – జనగామ

Advertisement
 
Advertisement
Advertisement