జనగామ రూరల్: ఇందిరా మహిళా శక్తి పథకం కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ ఐస్‌బాక్స్‌తో కూడిన త్రిచక్ర వాహన యూనిట్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు 40 శాతం సబ్సిడీ కింద కేటాయించిన ఒక మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్, రెండు ఐస్ బాక్స్‌తో కూడిన త్రిచక్ర వాహనం యూనిట్లకు గాను మొత్తం (21) దరఖాస్తులు రాగా, వాటిలో ముగ్గురు లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, డీఎల్సీ కమిటీ సభ్యులు, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుల, స్వయం సహాయక సంఘాలు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.
సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా
అమలుచేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలోని అన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో, వసతి గృహాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డీఏఓ అంబికా సోనీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఇన్‌చార్జ్ డీఆర్డీఓ నూరుద్దీన్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


