జనగామ: జిల్లాలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్స్ తగ్గించడం, ప్రమాదాలు నివారించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంస్థ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సమయానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎల్‌సీలు తప్పనిసరిగా మొబైల్ యాప్ ద్వారా తీసుకుని రిటర్న్ చేయాలని, ఇది ఫీల్డ్‌లో ప్రమాదాలు నివారించడానికి అత్యంత కీలకమని తెలిపారు. సమీక్షలో ఎస్‌ఈ సంపత్ రెడ్డి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, సారయ్య, డీఈ టెక్నికల్ గణేశ్, ఎంఆర్టీ డీఈ విజయ్ కుమార్, ఎస్‌ఏఓ రాజేందర్‌తో పాటు ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
విద్యుత్ సేవలపై ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ సమీక్ష


