జనగామ రూరల్: రుణ బకాయిలు చెల్లించాలని మండలంలోని వెంకిర్యాల గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులకు కోర్టు నుంచి నోటీసులు రాగా, వారు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి..నాలుగున్నర ఏళ్ల క్రితం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకోని నెలవారీగా చెల్లిస్తుండగా సీఏ, బ్యాంక్ మిత్ర సుమారు రూ.1.20కోట్లలను బ్యాంక్‌లో జమ చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయం మహిళలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు. ఇటీవల గ్రామస్తులు తమ బకాయిలు చెల్లించాలని పట్టుపట్టగా దశల వారీగా చెల్లిస్తానని అధ్యక్షురాలు రెండు గడువులు కోరింది. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో మహిళలు బ్యాంక్‌మిత్ర ఇంటికి తాళం వేశారు. బాధితురాలిని శుక్రవారం గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి డబ్బులు చెల్లించాలని అడగ్గా కోర్టులో తెల్చుకుంటామని తెలుపడంతో మహిళలు అందోళన చేపట్టారు. విషయం తెలిసిన ఎస్‌ఐ సతీష్ గ్రామానికి చేరుకోని మహిళతో మాట్లాడారు.. సంబంధిత విషయంపై బ్యాంక్‌మిత్ర కుటుంబ సభ్యుడు భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.


