● కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం
జనగామ: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా మౌనం వహించడం సిగ్గుచేటని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీజపీ నేతలు తెలంగాణపై పదేపదే విషం చిమ్ముతున్నారన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు, బీజేపీ ప్రజాప్రతినిధులు తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.


