పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

జనగామ రూరల్‌: తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్‌ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక పెన్షనర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద సంఘం బాధ్యులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 2వ పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెల శ్రీనివాస్‌, కన్వీనర్‌ కోర్నిలియస్‌, కో చైర్మన్‌ చంద్రశేఖర్‌ రావు, టీపీటీఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ , మహిపాల్‌ రెడ్డి, రామస్వామి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement