సాక్షిప్రతినిధి, వరంగల్‌ : | - | Sakshi
Sakshi News home page

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

Apr 18 2026 7:41 AM | Updated on Apr 18 2026 7:41 AM

..ఇలా కొందరు పోలీసుల వ్యవహారశైలి ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. కొందరు యువ ఎస్‌ఐలు క్రమశిక్షణ గీత దాటి వేటుకు గురవుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి సన్‌ప్రీత్‌సింగ్‌.. కట్టుతప్పి అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులను హెచ్చరికలు చేస్తూ నే ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని మందలించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌లోని ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌హెచ్‌ఓ)లు, ఎస్‌ఐలపైన ఉన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. పలువురిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు తీరు మారడం లేదు. దీనికి కారణం వారికి రాజకీయ అండే కారణమన్న విమర్శలు లేకపోలేదు.

వరుస ఘటనలతో కలకలం...

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడటం, సివిల్‌ సెటిల్మెంట్లలో తలదూర్చడాన్ని వరంగల్‌ కమిషనర్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మిల్స్‌ కాలనీలో ఎస్సైగా పనిచేస్తున్న సురేష్‌ను సస్పెండ్‌ చేసిన సీపీ.. ఆ ఠాణా పరిధిలోని కొన్ని ఘటనలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు ఎస్సై సతీష్‌ సస్పెన్షన్‌పైన చర్చ జరుగుతోంది. ఇదివరకే బచ్చన్నపేట ఎస్సై హమీద్‌ను పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్‌ చేయగా, తాజాగా ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను ఏఆర్‌కు అటాచ్డ్‌ చేశారు. కాగా వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని మరికొందరిపైనా విచారణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరున్నారు? అన్న చర్చ మొదలైంది.

సీరియస్‌గా ‘లేఖల’ పంచాయితీ..

గతేడాది డిసెంబర్‌లో వరంగల్‌ పోలీస్‌ డివిజన్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ముగ్గురిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరిపై త్వరలోనే బదిలీ లేదా సస్పెన్షన్‌ వేటు పడవచ్చన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధి లోని నలుగురు ఇన్‌స్పెక్టర్‌ల తీరుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, కేసులు కట్టడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులు కట్టడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలు పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేయించుకునేందుకు ‘లేఖ’లు పొందడం కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. విచారణ అనంతరం తీవ్రతను బట్టి వారిని సస్పెండ్‌ చేయడమా? వీఆర్‌కు పంపడమా? లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయడమా? అన్నది త్వరలోనే తేలనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారం, పది రోజుల్లో భారీగా ఇన్‌స్పెక్టర్‌ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండగా.. సుమారు 10 మందికి పైగా సీఐలు వరంగల్‌ నగరంలోని ఆరు కీలక ఠాణాలకు లేఖలు పొంది ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది.

యువ ఎస్‌ఐల అత్యుత్సాహం..

అడ్డంగా బుక్కవుతున్న వైనం

అత్యాచారం, వేధింపుల కేసుల్లో వారే..

వరుస సంఘటనలతో

పోలీసుశాఖలో కలకలం

పలువురిపై సస్పెన్షన్‌, బదిలీ వేటు

ఇన్‌స్పెక్టర్‌లపైనా ఆరోపణలు..

విచారణ స్థాయిలో ఫిర్యాదులు

చర్చనీయాంశంగా

కొందరు పోలీసుల తీరు

Advertisement
 
Advertisement
Advertisement