● తాగునీటి సమస్యలు రాకుండా
ముందస్తు ఏర్పాట్లు
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో రెండు ఆర్‌ఓ మినరల్ వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేసి తాగునీటిని శుద్ధి చేసి అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని జనరల్ ఓపీ, ఎమర్జెన్సీ తదితర విభాగాలకు అనుసంధానంగా కూలింగ్ ఫ్రిజ్‌తో కూడిన వాటర్ ట్యాప్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొదటి, రెండో అంతస్తుల్లో కూడా ప్రత్యేకంగా తాగునీటి సదుపాయాలను కల్పించారు. ఈ చర్యలతో ప్రతి విభాగంలో ఉన్న రోగులకు సులభంగా నీరు అందేలా చేస్తున్నారు.
ప్రైవేట్ వాటర్ కొనుగోళ్లకు చెక్
ఆసుపత్రిలో అందిస్తున్న తాగునీరు నాణ్యతతో ఉండటంతో, రోగులు బయట నుంచి నీటిని కొనుగో లు చేసే పరిస్థితి లేకుండా మారింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇస్తున్నారు.


