దేవరుప్పుల మండలంలో ఐకేపీ కింద 14 కొనుగోలు కేంద్రాలు, సహకార వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలను వారం కిందట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు నిర్వహకులు ఆయా కేంద్రాల వద్ద ఽకాంటాలు, తేమశాతం మిషన్, బస్తాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ప్రభుత్వం రైస్ మిల్లర్ల కు అలాట్‌మెంటు ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కాంటాలు పెట్టడం ప్రారంభించలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో 20వేల క్వింటాళ్ల ధాన్యం పేరుకపోయాయి.
జాప్యంతో తీరని నష్టం
గిట్టుబాటు ధర వస్తుందన్న రైతులకు కాంటాలు జాప్యం చేయడంతో తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఈసారి మండుటెండల ప్రభావంతో వరికోసే సమయానికి దాదాపు కావాల్సిన తేమశాతానికి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే తాలు, చెత్తచెదారం కోసం ప్రత్యేక మిషన్ల ద్వార వడబోసిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారం నుంచి ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం సత్వరమే కాంటాలు పెట్టకుంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతుల వాపోతున్నారు. కాగా నిర్వాహకులు ముందస్తు తాము కాంటా పెడితే మరింత తగ్గితే మిల్లర్ల కాంటా మేరకు తాము నష్టపోతామని పేర్కొనడం గమనార్హం.
కొబ్బరికాయలు కొడితే సరిపోదు
కొనుగోలు కేంద్రాల్లో కొబ్బరికాయలు కొడితే సరిపోదు. ధాన్యం కాంటా పెట్టినపుడే మాకు న్యాయం జరుగుతుంది. వారం నుంచి ఎదిరి చూస్తున్నాం. వడ్లు కాస్త రాళ్లలగా ఎండినయ్. ఆలస్యం చేసి జోకితే మాకే నష్టం.
–కాసర్ల మల్లారెడ్డి, రైతు నీర్మాల


