జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కడా లేదు. సిద్దిపేట జిల్లా మంగోలు వాటర్ ట్రీట్‌మెంటు ప్లాంటు, ధర్మసాగర్ రెండు ప్రాంతాల నుంచి 12 మండలాలకు తాగునీటి సరఫరా అవుతోంది. జిల్లాలో 1,28,309 ట్యాప్ కలెక్షన్లు ఉండగా, 827 ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. రోజువారీగా మంగోలు నుంచి 54.16 ఎంఎల్‌డీ, ధర్మసాగర్ నుంచి 25 ఎంఎల్‌డీ నీరు తీసుకుంటున్నాం. నీటి ఎద్దడి ఉండవచ్చనే ముందస్తు ప్రణాళికతో 52 ప్రాంతాలను గుర్తించి, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్థం చేశాం.
– వి.శ్రీకాంత్, ఈఈ, మిషన్ భగీరథ


