వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్‌ను హైదరాబాద్ ఏడో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియ ర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు.
పోలీస్ స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ
రఘునాథపల్లి: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, చార్జ్‌షీ ట్లను సమయానికి దాఖలు చేయాలని ఎస్సై నరేష్‌ను ఆదేశించారు. పనితీరును మరింత మెరుగుపరుచుకొని చేపట్టాల్సిన విధి విధానాలపై పలు సూచనలు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో డీసీపీ మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
టీబీ నివారణకు ప్రత్యేక కృషి
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం టీబీ నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటోందని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు అన్నారు. టీబీ ముక్తభారత్ అభియాన్ ఫేజ్– 2లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని సీహెచ్ సీని ఆయన సందర్శించి ఆసుపత్రిలోని పలు వార్డులను, రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ లగిశెట్టి అశోక్ కుమార్, కమల్‌హాసన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, వైద్యులు సిద్ధి సుదర్శన్ రెడ్డి, ప్రసన్న కృష్ణ, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
టైర్లు అంటుకుని మంటలు
జనగామ: జిల్లాకేంద్రంలోని హన్మకొండ రోడ్డు దయా నిలయం ఏరియాలో ప్రైవేటు బస్సులు పార్కింగ్ చేసే ప్రదేశంలో గురువారం వాహనాల పాత టైర్లకు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. టైర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెంది, దట్టమైన పొగ ఇళ్లలోకి చేరడంతో సమీప వాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురై, బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు అగ్నిమాపక శాఖను అలర్టు చే శారు. ఫైరింజన్ అక్కడకు వచ్చేసరికి సుమారు 20 టైర్లు కాలిపోగా, మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోగా, బహిరంగ ప్రదేశాల్లో మంటలకు కారణమయ్యే వస్తువులను ఉంచకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
వరంగల్ స్పోర్ట్స్: కమల్‌కింగ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ పోటీలను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్ ఆవరణలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్ –07, 09, 11, 13, 15 విభాగాల్లో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు కోసం 96760 56744 మొబైల్ నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


