రఘునాథపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రఘునాథపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన మండల సభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని, ప్రతీ గడపకు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రస్థాయిలో టాప్–2 లో నిలవడం గర్వకారణమన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తు, మంజూరు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ మారుజోడు రాంబాబు, గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, మండల ప్రత్యేకాధికారి కోదండరాం, తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మండల వైద్యాధికారులు స్రవంతి, పద్మ, ఏపీఎం వినీల, సర్పంచ్‌లు బొల్లం ఉమారాణి, శాగ కవిత, బొమ్మ వీరస్వామి, పోకల శ్రీనివాస్, సదానందం, అబ్రహం, పయ్యావుల రవి, వల్లాల అశోక్, సింగిరెడ్డి సునిత, రాంచందర్ తదితరులు ఉన్నారు.
సురక్షిత ప్రయాణానికి కంటిచూపు ప్రధానం
జనగామ రూరల్: సురక్షిత ప్రయాణానికి కంటిచూపు ప్రధానమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ –అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ పరిధిలో యార్డు డ్రైవర్‌లకు, ఇతర వాహనాల డ్రైవర్‌లకు కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలెక్టర్ ముఖ్యఅఽతిథిగా హాజరై మాట్లాడారు.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్ వినియో గం, సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, కౌన్సిలర్ రజని, తదితరులు పాల్గొన్నారు.
మండల సభలో కలెక్టర్
సందీప్‌కుమార్‌ఝా


