కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

ఘనంగా ఉప్పల మల్లన్న జాతర

దేవరుప్పుల: మండల కేంద్రంలో ఉప్పల మల్లన్న జాతరను పురస్కరించుకొని గురువారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం శివపార్వతుల శావలను పద్మశాలీలు మంగళ వాయిద్యాలు, భక్తగీతాలతో ఇంటింటా హారతులు స్వీకరిస్తూ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఐదురాళ్ల వద్ద ఎదురుకోళ్లు నిర్వహించారు. అనంతరం శివాలయం పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ పర్యవేక్షణలో వేద బ్రహ్మణుడు శానగొండ శివకరణ్‌శర్మ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి సర్పంచ్‌ పెద్ది కృష్ణమూర్తిగౌడ్‌, ఉపసర్పంచ్‌ నర్ర కోమలత, ఉత్సవ కమిటీ ప్రతినిధులు బూత్కూరి రాంమోహన్‌రెడ్డి, బెలిదే నర్సయ్య, కాసారపు సోమిరెడ్డి, పద్మశాలి శావ బృంద ప్రతినిధులు బిట్ల కొండయ్య, ఎల పాపయ్య, సోమనారాయణ, పాము యాకస్వామి, బిట్ల సుదర్శన్‌రాజు, కొంగ సోమయ్య, చిలుకూరి ఉమేష్‌, అంకాల యాదగిరి, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement