ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

జనగామ రూరల్‌: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. బుధవారం జిల్లాలో ఇసుక గ్రావెల్‌ తరలింపు ప్రక్రియపై డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి మైనింగ్‌, రవాణా, ఇంజనీరింగ్‌, నీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీపీఓ వెంకట్‌ రెడ్డి, ఏడీ మైన్స్‌ విజయ్‌ కుమార్‌, ఆర్టీఓ శ్రీనివాస్‌ గౌడ్‌, నీటి పారుదల శాఖ అధికారి ప్రవీ ణ్‌, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కొనుగోళ్ల కేంద్రాలను సజావుగా నిర్వహించాలి

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎం సీఎస్‌ హథీరాం, ఆర్టీఓ శ్రీనివాస్‌ గౌడ్‌, డీఏఓ అంబికా సోనీ, డీసీఎస్‌ఓ పావని, అడిషనల్‌ డీఆర్డీఓ నూరుద్దీన్‌, డీసీఓ కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఓబీ భూసేకరణ వేగవంతం చేయాలి

రైల్వే ఆర్‌ఓబీ భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. పెంబర్తిలో నిర్మించనున్న ఆర్‌ఓబీ కింద భూ సేకరణ ప్రక్రియ, ఇసుక తరలింపుపై రైల్వే, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గోపిరామ్‌, రైల్వే అధికారులు శేషా చారి, సామ్రాట్‌ రాయ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సరితా రాణి, జీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ చంద్ర మోహన్‌, పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికే మండల సభలు

కొడకండ్ల: మండల స్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకే మండల సభలు వేదికగా నిలుస్తాయని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌, సబ్‌ట్రెజరీ, ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ, అన్‌లైన్‌ సేవల అమలును కలెక్టర్‌ పరిశీలించారు. గురువారం నిర్వహించే మండల సభ నిర్వహణపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్‌.ఎల్‌. నరసింహరావు, తహసీల్దార్‌ ఉత్తలూరి అనీల్‌బాబు, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి

దేవరుప్పుల: నిలువ నీడలేని పేదలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లు సత్వరమే పూర్తి చేసేలా సంబంధిత యంత్రాంగం తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పనులను ఆయన పరిశీలించారు. పరిశీలనలో గృహా నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్‌, సర్పంచ్‌ పెద్ది కృష్ణమూర్తిగౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement