దేవరుప్పుల: గ్రామ నామకరణకు ప్రతీకగా ఏటా శివపార్వతుల కల్యాణోత్సవం పురస్కరించుకొని జరిగే ఉప్పల మల్లన్న జాతర బుధవారం మండల కేంద్రంలో వైభవంగా ప్రారంభమైంది. శివపార్వతుల కల్యాణోత్సవం పురస్కరించుకొని బుధవారం గణపతి పూజలతో మొదలై సాయంత్రం కొత్తవాడలో శావ, ఆలయం వద్ద బసవ ముద్దతో జాతర జోరందుకుంది. నేడు(గురువారం) స్వామి ఊరేగింపు, ఎదురుకోళ్లతో రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ వివరించారు. 17న పూర్ణాహుతి, సదస్యం, తీర్దప్రసాద వినియోగంతో బండ్లు తిరుగుట ప్రదర్శన, 18న తెల్లవా రు జామున దోపోత్సవం, అగ్నిగుండాలు ఉంటాయన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి తెలిపారు.
● నేడు శివపార్వతుల కల్యాణోత్సవం


