రిజర్వేషన్లపై కుట్రలను అడ్డుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై కుట్రలను అడ్డుకోవాలి

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తోందని, రాజ్యాంగంపై, దళితుల రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలంటే సంఘటిత పోరాటం ఒక్కటే మార్గమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ముందుగా స్థానిక పాత గాంధీ చౌరస్తా నుంచి శివునిపల్లి అంబేద్కర్‌సెంటర్‌ వరకు, అక్కడ నుంచి ఘన్‌పూర్‌ బస్టాండ్‌ వరకు చేపట్టిన బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్యే కడియం పాల్గొన్నారు. శివునిపల్లి అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి, స్థానిక బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయానికి అంబేడ్కర్‌ సచివాలయంగా నామకరణం చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ డీఎస్‌ వెంకన్న, ఘన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతానియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద పోలీసుశాఖ, రవాణాశాఖ సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్‌ మనీషానెహ్రా, సీఐ జి.వేణు, ఆర్‌డీఓ డీఎస్‌ వెంకన్న, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌, ఏఎంవీ శ్వేత పాల్గొన్నారు.

ఆ పెద్ద మనిషి తిని, తాగి ఎంజాయ్‌ చేసిండు

రఘునాథపల్లి: 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ పెద్ద మనిషి అభివృద్ధి మరిచి తాగి, తిని ఎంజాయ్‌ చేశాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యనుద్దేశించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. మండలంలోని కుర్చపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, 25 లక్షల సీసీ రోడ్డు, నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించి, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.. గత రెండేళ్లలో ‘మా నియోజకవర్గం, మా ఎమ్మెల్యే..’ అని గల్లా ఎగరేసి చెప్పేలా పనిచేస్తున్నానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, సర్పంచ్‌ బైకాని రాజు, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహా ఆవిష్కరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏసీపీ భీంశర్మ, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement