– మరిన్ని ఫొటోలు 9లోu
జనగామ: బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలో మహనీయుని విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీ నివాస్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాల వేసి, ఘనంగా నివాళులు సమర్పించారు.
నెహ్రూపార్కు ఏరియాలో..
జనగామ పట్టణం నెహ్రూపార్కు ఏరియాలో బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను మంగళవారం కీర్తి వీరేందర్, నీలం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 9వ వార్డు కౌన్సిలర్ గుడిగంటి వెన్నెల రామకృష్ణ, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్, టీఏపీఎస్ జిల్లా బాధ్యులు చల్లా తిరుపతిరెడ్డి, మనోజ్ కుమార్, కోటి, బాల నారాయణ, సాయిరాం, రజనీకాంత్, అరుణ్ కుమార్ పాల్గొని మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


