జాతర అభివృద్ధి పనుల్లో అవినీతి | - | Sakshi
Sakshi News home page

జాతర అభివృద్ధి పనుల్లో అవినీతి

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

చిల్పూరు: ఇటీవల జరిగిన శ్రీపతిపల్లి–కొండాపూర్‌ గ్రామాల సరిహద్దులో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా అభివృద్ధి పనులు మంజూరు కాగా శ్రీపతిపల్లి సర్పంచ్‌ కరుణాకర్‌ కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తి భారీ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నాణ్యతతో కూడిన పనులు చేయించాలని బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రంగు హరీష్‌ అధికారులను కోరారు. పనుల విషయంలో అవినీతికి సర్పంచ్‌ పాల్పడినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి వచ్చిన ఆయన జాతర ప్రదేశంలో మాట్లాడుతూ.. జాతర అబివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీహరి ప్రత్యేక నిధులు మంజూరు చేయగా పనులు చేపట్టిన సర్పంచ్‌ రూ.8 లక్షల విలువైన పనులు చేయకుండానే పంచాయతీరాజ్‌ డీఈ అండదండలతో ఎంబీ రికార్డు పూర్తి చేయించుకుని నిధులు దుర్వినియోగం చేయడానికి కుట్రపన్నారని అన్నారు. ఈవిషయంలో ఎమ్మెల్యే కడియం అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని కోరారు. గాలి ప్రవీణ్‌, తరుణ్‌, రాజయ్య, పిట్టల రాజు, చొక్కం రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement