పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి

కాళోజీ సెంటర్‌: ప్రభుత్వం చెల్లింవాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం టీడీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం డి.మహేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులను మంజూరు చేయాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement