చిల్పూరు మండలం కిష్టాజీగూడెం గ్రామంలో 2009లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన సర్వే నంబర్ 398, 399 భూ మిలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్, వార్డు సభ్యుల అంగీకారం కూడా తెలిపారు. వెంటనే సంబంధి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. – కిష్టాజీగూడెం గ్రామస్తులు
ఇంటి పేరు మార్చాలి
గ్రామంలో అద్దె ఇంటిలో ఉంటున్నామని ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది. తన తల్లి పేరుతో ఇల్లు రాగా ఇటీవల తన తల్లి గానబోయిన లక్ష్మీ మృతి చెందింది. తల్లి పేరుమీద ఉన్న ఇందిరమ్మ ఇంటిని తన తండ్రి కిష్టయ్య పేరు మీదకు మార్చాలి.
– గానబోయిన అనిత, అంకుషాపూర్


