జనగామ: జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్–అలైవ్ ప్రోగ్రాంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవేస్ యాదాద్రి–వరంగల్ ఎన్‌హెచ్ 163 ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి జీవీఎస్‌గౌడ్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్, ఎస్‌ఐ మహేష్‌గౌడ్, కానిస్టేబుళ్లు వెంకటేశ్, సమ్మద్, అధికారులు పాల్గొన్నారు.
ముగిసిన టెన్త్ పరీక్షలు
జనగామ రూరల్: గత నెలలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ప్రైవేట్ హాస్టల్స్, ప్రభుత్వ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో తమ ఇళ్లకు ఉత్సాహంగా పయనమయ్యారు.
రైతు సంక్షేమమే ధ్యేయం
జనగామ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజు అన్నారు. సోమవారం మండలంలోని శామీర్‌పేట, వెంకిర్యాల, గానుగపహాడ్, ఓబుల్‌కేశవాపూర్ తదితర గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శానబోయిన అనూష మహిపాల్, ఈర్ల అలేఖ్య నవీన్, గణిపాక వనిత మహేందర్, జెన్నేపల్లి జనార్ధన్ రెడ్డి, వంగాల మల్లేశం, సుధాకర్, తోటపల్లి రాజేశ్వరి, గద్ద చంద్రశేఖర్, డైరెక్టర్ నామాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రామప్పలో
టీజీఎఫ్‌డీసీ జీఎం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) జనరల్ మేనేజర్ జి. స్కైలాబ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా డివిజనల్ మేనేజర్ శైలజ, భూపాలపల్లి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ బి.కరుణాకర్ రావు ఉన్నారు.
హేమాచలక్షేత్రంలో జాతర వేలం పాటలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా క ల్యాణ మండపంలో ఆలయ ఇన్‌చార్జ్ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో జాతర వేలం పాటలను సోమవారం నిర్వహించారు. హన్మకొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో నెల రోజుల పా టు వివిధ రకాల షాపుల ఏర్పాటు, విక్రయాలకు అనుమతులు పొందేందుకు షీల్డ్, బహిరంగ వేలం పాటలను నిర్వహించారు.


