అప్రమత్తతతోనే ప్రాణాలకు భద్రత | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే ప్రాణాలకు భద్రత

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

లింగాలఘణపురం: ప్రయాణికుల అప్రమత్తతతోనే ప్రాణాలకు భద్రత ఉంటుందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో మండలంలోని నెల్లుట్లలో సర్పంచ్‌ నర్సింగ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించిడం, అతివేగం, అజాగ్రత్త, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపొద్దన్నారు.

జీపీల్లో రోడ్డు భద్రత కమిటీలు

జిల్లాలోని 280 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు డీసీపీ రాజమహేంద్రనాయక్‌ వివరించారు. ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న పోలీసుల సూచనలు ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు. నవాబుపేటలో జరిగిన గ్రామసభలో డీసీపీ పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లను అందించారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్‌ డీఆర్‌డీఓ నూరుద్ధీన్‌, సర్పంచ్‌ సదానందం, తహసీల్దార్‌ అండాలు, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసురెడ్డి, ఆయా గ్రామాల పాలక మండలి పాల్గొన్నారు.

దేవరుప్పులలో..

దేవరుప్పుల: రోడ్డు భద్రత నియమాలు పాటించ డం ప్రతిఒక్కరి బాధ్యతని డీసీపీ రాజమహేందర్‌ నాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని సింగరాజుపల్లి గ్రామ పంచాయతీ వద్ద ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత వారో త్సవాలు సర్పంచ్‌ కొండ ఊర్మిళమల్లారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించేలా విస్తృత అవగాహన క ల్పించాలన్నారు. ఎస్సై ఊర సృజన్‌కుమార్‌, హెచ్‌ఎం సుచిత్ర, ఉపసర్పంచ్‌ అనిల్‌, కార్యదర్శి వెంక న్న, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement