స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ ఆర్టిజన్, అన్‌మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట చేపడుతున్న సమ్మె సోమవారం ఆరవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు బొజ్జపల్లి సుభాష్ పార్టీ నాయకులతో కలిసి సమ్మె శిబిరాన్ని సందర్శించారు. కార్మికులు ఆరురోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ డివిజన్ చైర్మన్ పాశం రాజు, కన్వీనర్ వీరగోని లక్ష్మణ్, కోకన్వీనర్లు చెరిపెల్లి సురేష్, బదావత్ లక్ష్మణ్, నాయకులు రాంరెడ్డి, ఉబ్బని వెంకన్న, సురేష్, సరిత, డాన్ సురేష్, రమ్య, తదితరులు పాల్గొన్నారు.


