● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హసన్‌పర్తి: జూన్ 30వ తేదీ వరకు గండిరామారం ఎత్తిపోతల పథకం–1 పనులు పూర్తి చేసుకుని జూలై మొదటి వారంలో ప్రారంభించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. చింతగట్టు క్యాంప్‌లోని నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సోమవారం ఆ ఎత్తిపోతల పథకం పనులపై నీటిపారుదలశాఖ అధికారులు, కాంట్రాక్టర్లతోపాటు నియోజకవర్గ పరిధిలోని వేలేరు, చిల్పూరు మండలాల సర్పంచ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి ఇచ్చిన డెడ్‌లైన్‌లో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరాతీశారు. ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని కాంట్రా క్టర్లు, అధికారులనుఅడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం వరకు వేలేరు, చిల్పూరు మండలాల రైతులకు సాగునీరు అందించే విధంగా పనులు చేపట్టాలన్నారు.లిఫ్ట్–1పైన వేలేరు, చిల్పూరు మండలాలరైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదనపు చెరువులు నింపేందుకు రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. వారానికి రెండు సార్లు అధికారులు క్షేత్రస్థాయి పనులు పర్యవేక్షించాలని సూచించారు. చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఎస్‌ఐలు సీతారాం నాయక్, డీఈఈలు, తదితరులు పాల్గొన్నారు.


