వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్‌లో నిర్వహించిన అంతర్ జిల్లాల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అండర్–35 విభాగంలో ఖమ్మం జిల్లా లాలా, స్వప్నిల్ జోడి అత్యంత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. రన్నరప్‌గా కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీష్, కృష్ణారావు జోడీ నిలిచింది. 35 ప్లస్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సతీష్, కబీర్ జోడి విజేతగా నిలిచి ట్రోఫీని అందుకోగా, ఖమ్మం జిల్లా జోడీ హర్ష, వెంకటేశ్వర్లు రన్నరప్‌గాగా నిలిచారు.


