● ఘన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఎక్స్‌రే సౌకర్యాలు లేకపోవడంతో పేరుకే పెద్దాసుపత్రిగా మారింది. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చేవారు ఎక్స్‌రే కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఇటీవల ఘన్‌పూర్ సీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు అందించాలని ఆదేశించారు. గతంలో ఉన్న ఎక్స్‌రే మిషన్ మూలకుపడడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆసుపత్రిలో నూతన ఎక్స్‌రే మిషన్‌ను గురువారం ఏర్పాటు చేశారు. త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సీహెచ్‌సీ వైద్యాధికారి సంధ్య తెలిపారు.


