జనగామ రూరల్/నర్మెట/నర్మెట(తరిగొప్పుల): రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దని, సజావుగా కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం జనగామ మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, ఎర్రగొల్లపహడ్, అడవీకేశావాపూర్, నర్మెట మండలం మచ్చుపహాడ్, వెల్దండ, తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి, సోలిపురం, అంకుషాపురం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జనగామ మండలంలో జరిగిన ప్రారంభోత్సవాల్లో పెంబర్తి సర్పంచ్ రేఖ రాజు, ఎర్రగొల్లపహడ్ సర్పంచ్ చిర్ర సత్యనారాయణరెడ్డి, అడవీకేశావాపూర్ సర్పంచ్ భూరెడ్డి చైతన్య ప్రమోద్, ఏఎంసీ చైర్మన్ శివరాజ్, సీఈఓ భాస్కర్‌రెడ్డి, నర్మెటలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత, సర్పంచ్‌లు లింగాల హైమ రమేశ్, కంతి అంజనేయులు, మౌడ్ మౌనిక లక్పతి, బానోతు శంకర్ నాయక్, బానోతు బాలాజీ, ఏఓ అక్కిరెడ్డి కర్ణాకర్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ఆకుల వెంకట మల్లికార్జున్, ఏపీఎం ప్రమీల, ఏఈఓలు సుంకరి జగదీష్, భూక్య అనిత, గోనెల కన్నయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గద్దల నర్సింగరావు, మండల శాఖ అధ్యక్షుడు చింతకింది సురేశ్, ఉమ్మడి మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు నీరటి సుధాకర్, ఎండీ గౌస్, తరిగొప్పుల మండలంలో సర్పంచ్‌లు మంచినీళ్ల రాజు, దండెం శ్రీనివాస్, బైకాని రమ బాలరాజు, కుర్రె మల్లయ్య, తహసీల్దార్ ఎండీ మొహసిన్ ముజ్తాబ, ఏపీఓ కొత్తపల్లి నాగేశ్వర్ రావు, చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అర్జుల పోషిరెడ్డి, ధరావత్ లక్ష్మి, బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
పలు మండలాల్లో ధాన్యం కేంద్రాల ప్రారంభం


