ప్రతీ కుటుంబానికి
అంగన్‌వాడీ సేవలు అందించాలి
జనగామ రూరల్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు ఎయిడ్స్‌పై అవగాహన నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ఎయిడ్స్ నివారణపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే కళాజాత ద్వారా పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగామ, స్టేషన్ ఘనపూర్‌లలో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, వైద్యులు అశోక్, కమల్‌హాసన్, శ్రీతేజ, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సబ్ జైలులో క్షయ, కంటి, ఎక్స్‌రే పరీక్షలను, జనరల్ మెడిసిన్, చర్మ సంబంధ సమస్యలపై 23 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు.
ధన్‌ధాన్య పథకాన్ని సమర్థంగా
అమలుచేయాలి
ప్రధానమంత్రి ధన్‌ధాన్య యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఉద్యాన శాఖ అధికారి రవికాంత్, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, మార్కెటింగ్ శాఖ అధికారి రామకృష్ణ, సహకార శాఖ అధికారి కోదండరాములు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వసంత, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి అంగన్‌వాడీ సేవలను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..అంగన్‌వాడీ కేంద్రాల కోసం ప్రభుత్వ భవనాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రైవేట్ భవనాల వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని, వారంలోగా అందుకు సంబంధించిన అంచనాల నివేదికను సమర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, డీడబ్ల్యూఓ కోదండరాములు, మిషన్ శక్తి కో ఆర్డినేటర్ శారద, టీచర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


